NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

దేశం అభివృద్ధి చెందాలంటే బిజెపి పార్టీ తోనే సాధ్యం

1 min read

– ప్రధానమంత్రి మనసులో మాట 100వ ఎపిసోడ్ ను వీక్షించిన నియోజకవర్గ నాయకులు
– నరేంద్ర మోడీ సారధ్యంలోనే దేశం మరింత అభివృద్ధి..
– గారపాటి సీతారామాంజనేయ చౌదరి
పల్లెవెలుగు వెబ్ దెందులూరు : కొవ్వలిలోని మోటపర్తి భవన్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మనసులో మాట కార్యక్రమం విజువల్ దృశ్యం దెందులూరు నియోజకవర్గ నాయకులు వీక్షించారు. దేశం అభివృద్ధి చెందాలంటే భారతీయ జనతా పార్టీ తోనే సాధ్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో దేశం మరింత ముందుకు పోతుందని బిజెపి సీనియర్ నేత తపన స్వచ్ఛంద సంస్థల చైర్మన్ గారపాటి సీతారామాంజనేయ చౌదరి అన్నారు. ఆదివారం దెందులూరు నియోజకవర్గం లోని కొవ్వలి గ్రామంలోని మోటపర్తి భవనం లో ప్రధానమంత్రి మాన్ కి బాత్ మనసులో మాట అనే కార్యక్రమం 100 ఎపిసోడ్ ను తపన సంస్థ చైర్మన్ గారపాటి చౌదరి ఆధ్వర్యంలో భారీ స్క్రీన్ పై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రసంగాన్ని తెలుగులో ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో దెందులూరు నియోజకవర్గ బిజెపి నేతలు. దెందులూరు మండల నాయకులు. కొవ్వలి సర్పంచ్ ఇంతేటి మధులత గంగాధర్. సహకార సంఘం బ్యాంక్ అధ్యక్షుడు కొమ్మిన రాము. పలువురు గ్రామస్తులు పాల్గొని వీక్షించారు.

About Author