రైతు బాగుంటేనే.. దేశం బాగుంటుంది : టి.జి భరత్
1 min readపల్లెవెలుగు వెబ్, కర్నూలు: రైతులు బాగున్నప్పుడే దేశం కూడా బాగుంటుందన్నారు తెలుగుదేశం పార్టీ కర్నూలు నియోజకవర్గ ఇంచార్జి టి.జి భరత్. బుధవారం నగరంలోని మౌర్య ఇన్ లో ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన రైతన్న అనే డైరీని టి.జి భరత్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టి.జి భరత్ మాట్లాడుతూ రైతుల కోసం 50 ఏళ్లుగా డైరీ రూపంలో విలువైల సూచనలు ఇవ్వడం గొప్ప విషయమన్నారు. దేశానికి అన్నం పెట్టే రైతన్న బాగుండాలని ప్రతి ఒక్కరూ కోరుకోవాలన్నారు. ఇక జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేసి రైతులకు మేలు చేయాలని భరత్ ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం రైతు సంఘం జిల్లా కార్యదర్శి జగన్నాధం మాట్లాడుతూ రైతుల పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలన్నారు. రైతుల రుణాలన్నీ మాఫీ చేసి సబ్సీడీలు అందజేయాలన్నారు. డి.హెచ్.పి.ఎస్ జిల్లా కార్యదర్శి మహేష్, చిన్నవ్యాపారస్తుల సంఘం నాయకులు శ్రీనివాసులు, ఏ.ఐ.వై.ఎఫ్ నాయకులు మల్లికార్జున, క్రిష్ణ, రమేష్, తదితరులు పాల్గొన్నారు.