NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప‌దో త‌ర‌గ‌తి ఫెయిల‌య్యి ఉంటే.. కొడైకెనాల్ ట్రిప్ !

1 min read

పల్లెవెలుగు వెబ్ : ప‌దో త‌ర‌గ‌తి ఫెయిల్ అయిన విద్యార్థుల‌కు ఓ వ్యాపార‌వేత్త బంప‌ర్ ఆఫ‌ర్ ప్రక‌టించారు. కేర‌ళ‌కు చెందిన సుధీర్ అనే వ్యాపార‌వేత్త.. త‌మిళ‌నాడులోని కొడైకెనాల్ లో వివిధ వ్యాపారాలు నిర్వహిస్తు.. అక్కడే నివ‌సిస్తున్నారు. కేర‌ళ ప్రభుత్వం ప్రక‌టించిన ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు కొడైకెనాల్లోని త‌మ ఇంట్లో ఉంటూ .. కొడైకెనాల్ అందాల‌ను చూడొచ్చంటూ ఆఫ‌ర్ ప్రక‌టించారు. ఫేస్ బుక్ వేదిక‌గా ఆయ‌న ఈ ప్రక‌ట‌న చేశారు. దీంతో ఈ ప్రక‌ట‌న వైరల్ గా మారింది. ఫెయిల్ అయిన విద్యార్థులు ఫెయిల్ అయిన‌ట్టు ధృవీక‌రించే ప‌త్రాలు తీసుకొని రావాల‌ని ఆయ‌న ష‌ర‌తు పెట్టారు. ప‌దో త‌ర‌గ‌తి పాసైన విద్యార్థులు ఆనందంతో సంబరాలు జ‌రుపుకుంటారు. ఫెయిల్ అయిన విద్యార్థులు బాధ‌లో ఉంటారు కాబ‌ట్టి వారికోసం ఈ ఆఫ‌ర్ ప్రక‌టించిన‌ట్టు ఆయ‌న తెలిపారు.

About Author