NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రభుత్వ తీరును ఎండగడితే…బూతులు తిడతారా! ఏ సన్నాసికి భయపడను: పవన్​ కళ్యాణ్​

1 min read

పల్లెవెలుగువెబ్​, మంగళగిరి: రాష్ట్రంలో అభివృద్ధి లేని పాలన సాగుతుంటే…ప్రభుత్వ పనితీరును ఎండగడితే బూతుపురాణం మొదలు పెడతారా…? అంటూ జనసేన అధినేత పవన్​కళ్యాణ్​ ఎదురుదాడికి దిగారు. బుధవారం మంగళగిరి పార్టీ కార్యాలయంలో రాష్ట్రస్థాయి కార్యకర్తల విస్తృత సమావేశం నిర్వహించారు. సమావేశంలో అధినేత పవన్​కళ్యాణ్​ మాట్లాడుతూ ప్రజల పక్షాన ఉంటూ పోరాడుతూ ప్రభుత్వ పాలనలోపాలను ఎత్తిచూపడంలో తప్పేంటని ప్రశ్నించారు. కోడికత్తికి, కిరాయిమూకలకు భయపడే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు. ప్రసంగంలో వైసీపీ నేతలను ఉద్ధేశించి గ్రామసింహాలు అంటూ వీధి కుక్కలతో పోలుస్తూ తీవ్ర విమర్శనాస్త్రాలతో దుయ్యబట్టారు. నేనూ బాపట్లలోనే పుట్టాను… ఏభాషలోనైనా తిట్టగలను, కాని నేను సంస్కారవంతుడినని, నేను ఎవరినీ చెడుగా మాట్లడాడలేదన్నారు. నన్ను తిడుతుంటే.. నేను బలపడతానే తప్పా… బలహీనపడనన్నారు. ప్రభుత్వ సొమ్ము ప్రజలందరికీ సమానంగా అందించాలే తప్పా ఓటు వేసిన వారికే పథకాలంటే ఊరుకునేది లేదన్నారు. 2014లో తెదేపా, బీజేపీలకు రాష్ట్ర అభివృద్ధి కోసమే మద్దతు ఇచ్చానన్నారు. సాటి మనిషికి అన్యాయం జరిగితే స్పందించే గుణం నాదన్నారు. సన్నాసులకు భయమేంటో నేను నేర్పిస్తానంటూ కులాల చాటున దాక్కుంటే బయటకు లాక్కొచ్చి కొడతానంటూ హెచ్చరించారు. కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి ముందు పార్టీ శ్రేణులతో పలు అంశాలపై చర్చించారు. సమావేశానికి వచ్చే సమయంలో జనసేన అధినేత పవన్​కళ్యాణ్​కు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.

About Author