పేద రైతుల భూములు లాక్కుంటే ఉద్యమం తప్పదు
1 min read–సాగులో ఉన్న రైతుల భూముల్లో సబ్ స్టేషన్
– సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామాంజనేయులు
– సిపిఐ జిల్లా కార్యదర్శి రంగా నాయుడు
పల్లెవెలుగు వెబ్ గడివేముల : అనుభవంలో ఉన్న రైతుల భూములు లాక్కుంటే ఉద్యమం తప్పదని సోమవారం నాడు సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామాంజనేయులు, సిపిఐ జిల్లా కార్యదర్శి రంగా నాయుడు అధికారులను, నాయకులను హెచ్చరించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మండల పరిధిలోని కొర్రపోలురు గ్రామంలోని ఎస్ఆర్బిసి కాలువ పక్కన ఉన్న సర్వే నెంబర్ 11లో 220కేబి హై పవర్ సబ్ స్టేషన్ నిర్మించాలన్న పేరుతో బలవంతంగా అనుభవంలో ఉన్న రైతులను కాదని నాయకుల అధికారుల అండదండలతో భూములను ఆన్లైన్ లో ఎక్కిచుకున్నారని, అనుభవంలో ఉన్న రైతులను పోలీసులతో బెదిరించారన్నారు. సాగుకు అనుకూలంగా ఉన్న భూమూలల్లో కాకుండా వేరొక చోట సబ్ స్టేషన్ వేయాలన్నారు.మండల వైస్సార్సీపీ నాయకుడు జడ్పీటీసీ ఆర్బీ చంద్రశేఖర్ రెడ్డి ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందని ఎమ్యెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి అండదండలతో ఒక్క కొర్రపోలురు గ్రామంలోనే 57ఎకరాలు ఆక్రమణ చేసారని ఇంకా మండలంలోని మిగితా గ్రామాల్లో ఇంకెన్ని వందల ఎకరాలు అక్రమణకు గురైన్నాయా తెలియాలన్నారు.పెదరైతులకు చెందాల్సిన భూములు అధికార వైసీపీ నాయకుల చేతుల్లో ఉంటే రెవిన్యూ అధికారులు నిమ్మకు నిరీతినట్లు వ్యవహారిస్తునరన్నారు . పేదల భూములు లాక్కోవాలని చూస్తే ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు . అనంతరం తహసీల్దార్ శ్రీనివాసులకు వినతిపత్రం అందజేశారు. రైతులకు అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోమన్నారు. ఈ విషయాన్నీ సిపిఐ జాతీయ, రాష్ట్ర నాయకులకు తెలియజేసి ఈ ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమం లో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బాబా పకృద్దీన్, జిల్లా కార్యవర్గ సభ్యులు ప్రసాద్, ప్రతాప్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ధనుంజయ్, ఏఐఎస్ఎఫ్ నాయకులు అహ్మద్ హుస్సేన్ మండల నాయకులు రాంప్రసాద్,రసూల్,సంజన్న, నబిసా బాధిత రైతులు పాల్గొన్నారు.