PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మాస్క్​ లేకపోతే.. జరిమాన, అరెస్టు

1 min read

– పోలీసులతోపాటు వాలంటీర్లనూ మాస్క్​ వాచర్స్​గా పెట్టండి
– ఐదుగురి కంటే ఎక్కువ గుమికూడితే చర్యలు
– కలెక్టర్​ జి. వీరపాండియన్​
పల్లెవెలుగు వెబ్​, కర్నూలు : కోవిడ్​ నిబంధనలు పాటించని వారిపై జిల్లా యంత్రాంగం కొరఢా ఝుళిపించనుంది. మాస్క్​ లేకపోతే జరిమాన విధించి అరెస్టు చేయాలని ఇందుకు పోలీసులతోపాటు వాలంటీర్లను వాచర్స్​గా పెట్టుకోండని ఉన్నతాధికారులను ఆదేశించారు. కలెక్టర్​ జి. వీరపాండియన్​. ఆదివారం కలెక్టరేట్​ నుంచి ఎస్పీ, జేసీలు, సబ్​ కలెక్టర్​, ఆర్డీఓలు, మున్సిపల్​ కమిషనర్లు, జిల్లా నోడల్​ అధికారులతో టెలికాన్ఫరెన్స్​ నిర్వహించారు. పట్టణాలు , గ్రామాల్లో మాస్క్​ ఖచ్చితంగా వాడాలని, ఐదుగురి కంటే అధిక మంది గుమికూడితే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. కోవిడ్ నిబంధనలు పాటించని, మాస్క్ ధరించని, ఎక్కువ గుంపులుగా ఉన్న, కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించే అన్ని రకాల వ్యాపారాల షాప్స్, కిరాణా, కూరగాయలు, పండ్లు, మాంసం మార్కెట్స్, వారాంతపు సంతలు, వీధి వ్యాపారుల బండ్లను, హోటల్స్ ను, టీ కొట్లను, చికెన్/ మటన్ షాప్స్ , ఆటోలను డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారం సీజ్ చేయండి..క్లోజ్ చేయించాలని కలెక్టర్​ ఆదేశించారు. కలెక్టర్ టెలి కాన్ఫరెన్స్ లో ఎస్పీ డా.కె.ఫక్కీరప్ప, జేసీ(రెవెన్యూ) రామసుందర్ రెడ్డి, జేసీ( సంక్షేమం) శ్రీనివాసులు, కర్నూలు మున్సిపల్ కమిషనర్ డికె బాలాజీ, నంద్యాల సబ్ కలెక్టర్ కల్పన కుమారి, డి.ఆర్.ఓ. పుల్లయ్య, ఆర్డిఓ లు హరి ప్రసాద్, రామకృష్ణా రెడ్డి, జిల్లా నోడల్ అధికారులు పాల్గొన్నారు.

About Author