PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సినిమా ఫెయిల్ అయితే.. డ‌బ్బు వెన‌క్కిచ్చేస్తా !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : హీరో ర‌వితేజ ఆహాలో ప్ర‌సార‌మ‌వుతున్న అన్ స్టాప‌బుల్ విత్ బాల‌కృష్ణ షోలో అథితిగా పాల్గొన్నారు. ఈ ఎపిసోడ్‌లో బాలయ్యకు తనకు మధ్య ఎలాంటి గొడవలు లేవని కుండ బద్ధలు కొట్టేశాడు రవితేజ. సినిమాల గురించి మాట్లాడుతూ తాను నటించిన మూవీస్‌ ఏమైనా ఫ్లాప్‌ అయితే తనకిచ్చిన రెమ్యునరేషన్‌లో కొంత భాగాన్ని నిర్మాతలకు తిరిగి ఇచ్చేస్తానని చెప్పుకొచ్చాడు. ఈ విషయం తెలిసి అభిమానులు ఆయనను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. కాగా రవితేజ ప్రస్తుతం ‘ఖిలాడీ’, ‘రామారావు ఆన్‌ డ్యూటీ’, ‘రావణాసుర’ సినిమాలు చేస్తున్నాడు.

                                                   

About Author