PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సినిమా మ‌త‌మైతే.. దానికి రాజ‌మౌళి పీఠాధిప‌తి !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఆచార్య సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ఘ‌నంగా జ‌రిగింది. చిరంజీవి, చ‌ర‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన ఈ సినిమాకు కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సంద‌ర్భంగా చిరంజీవి మాట్లాడుతూ ‘‘రానున్న రోజుల్లో ప్రాంతీయ సినిమా అనే కాన్సెప్ట్‌ ఉండదు. ఏ సినిమా తీసినా ఇండియన్‌ సినిమా అవుతుంది. అందుకు ఉదాహరణ రాజమౌళి తీసిన ‘బాహుబలి’, ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రాలు. అలాంటి సినిమాల రూపకర్త మన పరిశ్రమలో ఉండడం గర్వ కారణం. భారతీయ సినిమా ఒక మతం అయితే, ఆ మతానికి పీఠాధిపతి రాజమౌళి. తెలుగు సినిమా ఆయన్ను ఎప్పుడూ గుర్తుంచుకోవాలి’’ అని చిరంజీవి అన్నారు.

                              

About Author