పాతపెన్షన్ పునరుద్ధరణ చేయకపోతే ప్రభుత్వానికి గుణపాఠం తప్పదు
1 min read– పాతపెన్షన్ కు ప్రభు త్వాన్ని మార్చే శక్తి ఉంది. హిమాచల్ లో జరిగింది అదే -ఎస్టీయూ
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: సిపిఎస్ రద్దు పైనముఖ్యమంత్రి ఇచ్చిన హామీ నెరవేర్చకుండా పాత పెన్షన్ పునరుద్ధరణ పై రాజకీయ నిర్ణయం తీసుకోక పోతే వచ్చే సాధారణ ఎన్నికల్లో ప్రభుత్వానికి ఘోరీ కట్టడానికి 13 లక్షల మంది ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లు మరియు వారి కుటుంబాలు మొత్తం 60 లక్షల మంది సిద్ధంగా ఉన్నారని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హెచ్. తిమ్మన్న తెలిపారు. ఈ మేరకు వారు తేదీ 29-08-2023 న కర్నూలు నగరం నందలి సలాం ఖాన్ ఎస్టీయూ భవనం లో ప్రతి పాదిత జిపిఎస్ ఆర్డినెన్స్ పై ముఖ్య నాయకులతో సమీక్ష సమావేశం జిల్లా అధ్యక్షులు ఎస్. గోకారి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.
1). 2019 లో గౌరవ ముఖ్య మంత్రి గారు వారి పాదయా త్రలో అధికారంలోకి వచ్చిన వారంలోపే సిపిఎస్ రద్దు చేస్తామని పాత పెన్షన్ విధానమును పునరుద్ధరణ చేస్తామని వందల సార్లు హామీ ఇచ్చిన విషయం సామాజిక మాధ్యమాలలో వీడియోలు ఉన్నాయని తెలియజేశారు. వారికి మేనిఫెస్టో అంటే పవిత్ర గ్రంథం అని బైబిలు, ఖురాన్, భగవద్గీత తో పోల్చి విశ్వసనీ యత గురించి మాట్లా డిన ముఖ్యమంత్రి నేడు ఆ విశ్వసనీయత ఏమైంది అని ప్రశ్నించారు.
2) గత నాలుగు సంవత్సరా లుగా జాయింట్ స్టాప్ సమా వేశాలలో 2003 నోటిఫికేషన్ ఉపాధ్యాయులకు, ఉద్యోగుల కు పాత పెన్షన్ అమలు చేస్తామని,గణాంకాలు సహితం తెప్పించిన ప్రభుత్వం తీరా ఇప్పుడు వారికి కూడా జీపీఎస్ వర్తింప చేయడం మోసం చేయడమేనని విమర్శించారు.
3). పాత పెన్షన్ అమలు చేయడానికి సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తున్నామని ఇతర రాష్ట్రాల్లో కూడా నివేదికలు తెప్పించుకున్న ప్రభుత్వం రాజస్థాన్, ఛత్తీస్గడ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ వంటి రాష్ట్రాల నుంచి వచ్చిన నివేదికల్లో పాత పెన్షన్ లేదా అని గుర్తు చేశారు.
పాత పెన్షన్ పునరుద్ధరణ అనేది పూర్తిగా రాజకీయ నిర్ణయమని దీనిని ఆర్థిక భారంగా ప్రభుత్వాలు భావిస్తే దానికి తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చ రించారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం పెన్షన్ అనేది ఉద్యోగుల హక్కు అని ప్రభుత్వాలు పెట్టే బిక్ష కాదు అని తెలుసుకోవాలని హితవు పలికారు.
4) సిపిఎస్ మరియు జిపిఎస్ రెండు ఒకటేనని జిపిఎస్ అనేది కొత్త సీసాలో పాత సారా లాంటిదని రెండింటిలోనూ ఉద్యోగుల కాంట్రిబ్యూషన్, షేర్ మార్కెట్, ఉన్నాయని ఈరోజుల్లో ఒకటో తారీకు జీతాలు చెల్లించే గ్యారెంటీ ఇవ్వలేని ఈ ప్రభుత్వాలు ఉద్యోగుల పదవి విరమణ తర్వాత పెన్షన్ గ్యారెంటీ ఎలా ఇస్తారని దీనిని ఉద్యోగ ఉపాధ్యాయులు ఎలా నమ్మాలో కూడా ప్రభుత్వం తెలియజేయాలని డిమాండ్ చేశారు.
5) కేవలం ఐదు సంవత్సరాలు శాసన సభ్యులుగా ఎన్నికైతే జీవితాంతం పెన్షన్ తీసుకునే ప్రభుత్వ పెద్దలు 30 సంవత్స రములు ప్రజలకు సేవ చేసిన ఉద్యోగులకు పెన్షన్ ఇవ్వడానికి మీనమేషాలు లెక్క వేయడం అత్యంత బాధాకరమని విచారము వ్యక్తం చేశారు.6) ఉద్యోగులు ఉపాధ్యాయు లు కార్మికులు పెన్షనర్లు సంఘటితం కావాలని సాధార ణ ఎన్నికల్లో 60 లక్షల మంది ఓట్లు పాత పెన్షన్ కు అనుకూ లంగా వేయడానికి ప్రచారం గ్రామ గ్రామాన చేస్తామని, హిమాచల్ ప్రదేశ్ లో ఒక్క శాతం ఓట్ల తేడాతో ప్రభు త్వాలు తల క్రిందలు అయిన విషయాన్ని ఆంధ్రప్రదేశ్ లో తిరగరాస్తామని తెలియజే శారు.7) ఇప్పటికైనా అధికారంలో ఉండే ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు పాత పెన్షన్ పునరుద్ధ రణ చేస్తూ రాష్ట్ర శాసనసభలో చట్టం చేయాలని లేని పక్షంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని హెచ్చరించారు.. ఈ సమావేశంలో ఎస్టీయూ రాష్ట్ర మైనారిటీ కన్వీనర్ సయ్యద్ ముదసిర్ అహ్మద్, ఎం.ఉచీరప్ప, చింతా శ్రీనివాసులు, శివ నాగిరెడ్డి, వెంకట్ రాముడు తదితరులు పాల్గొన్నారు. హెచ్.తిమ్మన్న STUAP రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.