జగనన్న క్యాంటీన్లు తెరిస్తే.. దైవదూతగా పేరొస్తుంది !
1 min read
పల్లెవెలుగు వెబ్ : నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు మరోసారి సీఎం జగన్ మోహన్ రెడ్డికి లేఖ రాశారు. అన్న క్యాంటీన్లకు బదులుగా జగనన్న క్యాంటీన్లు తెరవండి అంటూ లేఖలో సీఎంను కోరారు. ‘ అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఇదే విషయం అన్ని మత గ్రంధాల్లో చెబుతారు. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం ప్రస్తుతం ఎంతో అవసరం. అన్నదానం అన్ని దానాల్లోకెల్లా మిన్న. అన్నదానం చేస్తూ సీఎం జగన్ కు మంచి పేరు రావడమే కాకుండా.. దైవదూతగా ప్రజల్లో మీ పేరు స్థిరపడిపోతుంది ’ అంటూ రఘురామ తన లేఖలో పేర్కొన్నారు. తక్షణమే జగనన్న క్యాంటీన్లు తెరవాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం 204 చోట్ల అన్న క్యాంటీన్లు తెరిచిందని, గత ప్రభుత్వాన్ని తలదన్నేలా వెయ్యి కోట్లతో జగనన్న క్యాంటీన్లు తెరవాలని కోరారు.