PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

టిటిడి చైర్మన్ పదవి యాదవులకు ఇవ్వకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తాం

1 min read

– వై.నాగేశ్వరరావు యాదవ్

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: తెలుగుదేశం పార్టీ బీసీ సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ యాదవ హక్కుల పోరాట సమితి రాష్ట్ర గౌరవ అధ్యక్షులుజాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ఈరోజు కర్నూలులోని నంద్యాల చెక్పోస్ట్ సమీపంలో శ్రీకృష్ణ దేవాలయం నందు యాదవుల మనోభావాలు దెబ్బ తినే విధంగా ఈ వైసీపీ ప్రభుత్వం తీరు,ప్రపంచ ఆరాద్య దైవమైన వెంకటేశ్వర స్వామి గుడిలో యాదవులకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. టీటీడీ చైర్మన్ పదవి యాదవులకే ఇవ్వాలని యాదవ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు అయ్యన్న యాదవ్ గారి ఆధ్వర్యంలో అన్ని యాదవ సంఘాల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సమావేశంలో యాదవ హక్కుల పోరాట సమితి రాష్ట్ర గౌరవ అధ్యక్షులు💐 జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ తెలుగుదేశం పార్టీ బీసీ సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ వై.నాగేశ్వరరావు యాదవ్ , ఉపాధ్యక్షులు శ్రీరాములు యాదవ్,కర్నూలు జిల్లా మహిళా అధ్యక్షురాలు విజయలక్ష్మి యాదవ్ ,హుసేన్నప్ప యాదవ్ , జిల్లా ప్రధాన కార్యదర్శి శేఖర్ యాదవ్ , రాజు యాదవ్ ,ప్రభాకర్ యాదవ్ గారు,సూర్యనారాయణ యాదవ్ ,నాగేశ్వరరావు యాదవ్ గారు, యాదవ సంఘం నాయకులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా యాదవ సంఘం నాయకులు మాట్లాడుతూ:యాదవుల,హిందువుల  మనోభావాలు దెబ్బ తినే విధంగా ఈ వైసీపీ ప్రభుత్వం ప్రవర్తిస్తుంది.ఆనాడు పాదయాత్రలో బీసీలను గొప్పగా చూసుకుంటాను గుండెల్లో పెట్టి చూసుకుంటామని చెప్పి ఈరోజు బీసీలను అనారోగ్య ప్రయత్నం చేస్తున్నారు. నెల రోజుల కిందట యాదవ టిటిడి చైర్మన్ బోర్డ్ పదవి యాదవులకు ఇస్తున్నామని మీడియా, పత్రికలతో చెప్పి ఈరోజు రెడ్డి వర్గానికి కట్టబెట్టడం ఎంతవరకు సమంజసం. టిటిడి చైర్మన్ పదవులను యాదవులకు కాకుండా వైసిపి ప్రభుత్వం ఉన్నంతవరకు వాళ్ళ చిన్నాన్న ఈరోజు ఇంకొక చిన్నాన్నకు ఆ పదవిని కట్టబెట్టి.ప్రపంచ ఆరాద్య దైవమైన వెంకటేశ్వర స్వామి గుడిలో యాదవులకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. టీటీడీ చైర్మన్ పదవి యాదవులకే ఇవ్వాలని యాదవ కుల పోరాట సమితి అన్ని యాదవ సంఘాల తరపున డిమాండ్ చేస్తున్నాము.వైసిపి నాయకులలో కృష్ణమూర్తి గారికి అంత సీనియారిటీ ఉండి ఆయనకు టీటీడీ చైర్మన్ ఇస్తామని చెప్పి చివరి క్షణంలో ఆయనకు ఇవ్వకుండా రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చారు. కృష్ణమూర్తి గారికి చైర్మన్ పదవి ఇవ్వలేదని చెప్పి రమేష్ యాదవ్ గారు వైసీపీ పార్టీ నుండి వెళుతున్నట్టు రాజీనామా చేస్తే,కానీ కొంతమంది వైసీపీ పార్టీలో ఉండే యాదవులు మాత్రం ఆయనను తప్పుపడుతూ ఆయనను దూషించడం,విమర్శించడం, ఎంతవరకు సమంజసం. యాదవులను యాదవులు విమర్శించుకోవడం మంచిది కాదు. యాదవ సంఘాలు పార్టీలకు అతీతంగా,అన్ని పార్టీల్లో ఉన్న యాదవుల కొరకే పోరాటం చేస్తున్నాయి. కచ్చితంగా ప్రతి పార్టీలో చిన్న చిన్న పదవులు కాదు కావాల్సింది. మన జనాభా లెక్కల ప్రకారం మనకు చట్టసభల్లో రిజర్వేషన్లు, రాజ్యాధికారంలో భాగం కావాలి.యాదవులు ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు కావాలి. కర్నూలు జిల్లాకు రెండు ఎమ్మెల్యే టికెట్లు, ఉమ్మడి జిల్లాల్లో ఒక ఎంపీ టికెట్ యాదవులకు కేటాయించాలని యాదవ సంఘం తరపున డిమాండ్ చేస్తున్నాం. టీటీడీ చైర్మన్ పదవిని త్వరలోనే యాదవులకు కేటాయించకపోతే యాదవులంతా ఏకమై, అన్ని యాదవ సంఘాలు ముందుకొచ్చి రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలను చేపడతాం అని ఈ వైసీపీ ప్రభుత్వంను హెచ్చరిస్తున్నాం.

About Author