రహదారి వేయకుంటే నిరాహార దీక్షలకు దిగుతాం
1 min read– రాయలసీమ విద్యార్థి ఫెడరేషన్ ఏ ఐ ఎఫ్ బి..
పల్లెవెలుగు, వెబ్ పాణ్యం: పాణ్యం మండలం కేంద్రం లో ఏ పీ మోడల్ స్కూల్ కేజీబీవీ స్కూల్ కు రహదారి వేయకుంటే ప్రత్యక్ష నిరాహార దీక్షలకు దిగుతామని రాయలసీమ విద్యార్ధి, ఫెడరేషన్ ఆధ్వర్యంలో తాసిల్దార్ ఎంపీడీవో కలెక్టర్, కార్యాలయం ముందు ప్రత్యక్ష నిరాహార దీక్షలకు శ్రీకారం చుడతామని రాయలసీమ విద్యార్థి ఫెడరేషన్ అధ్యక్షులు బత్తిన ప్రతాప్ హెచ్చరించారు పాణ్యం లో గత పది సంవత్సరాల నుండి మోడల్ స్కూల్, కస్తూరిబాయి స్కూల్ కు రహదారి కోసం అలుపెరుగని పోరాటాలు ఉద్యమాలతో రాయలసీమ విద్యార్థిఫెడరేషన్ ధర్నాలు చేస్తే ఏ ఒక్క అధికారి స్పందించలేదని గతంలో అధికారులు ఎన్నోసార్లు ఆ యొక్క స్కూల్ ను సందర్శించిన హామీలకే పరిమిత మ య్యారే గాని రహదారి కోసం ఏ ఒక్క అధికారి చొరవ తీసుకోలేదని ఆరోపించారు అధికారులు స్పందించి శాశ్వత రోడ్డు ఏర్పాటు చేయాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి ఇలాగే ఉంటే విద్యార్థుల యొక్క భవిష్యత్తు నాశనం అవుతుందని వారు హెచ్చరించారు అనంతరం బుధవారం నాడు పాణ్యం మండలంలోని తహసిల్దార్ మల్లికార్జున కు వినతిపత్రం ఇచ్చారు ఈ కార్యక్రమంలో అల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ స్టేట్ కౌన్సిల్ సభ్యులు వనము వెంకటాద్రి, kj శ్రీనివాసరావు ,చిరంజీవి, వనం సుధాకర్, వనము వెంగరాజు తదితరులు పాల్గొన్నారు.