PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అదే జ‌రిగితే 500 కోట్ల మంది ఉనికి లేకుండాపోతారు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : న్యూజెర్సీ రూట్గెర్స్‌ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు.. అణు యుద్ధాలతో తలెత్తబోయే సంక్షోభాల మీద ఒక సుదీర్ఘ అధ్యయనం నిర్వహించారు. దీని ప్రకారం.. ఆధునిక అణుయుద్ధం వల్ల తాండవించే కరువు, ఆహారపంటల లేమి ద్వారానే ఎక్కువ మంది బలైపోతారని.. ఆ సంఖ్య సుమారు ఐదు బిలియన్లు(ఐదు వందల కోట్ల మందికిపైనే) ఉంటుందని పేర్కొన్నారు. అణ్వాయుధాల పేలుడుతో వాతావరణంలో సూర్యకాంతి నిరోధించే మసి ద్వారా ఆహార కొరత ఏర్పడుతుందని.. ప్రాణాంతకమైన పేలుళ్ల వల్ల కలిగే ప్రాణనష్టం కంటే ఇది చాలా ఎక్కువని ఆ బృందం అభిప్రాయపడింది. ఒకవేళ అమెరికా-రష్యా మధ్య గనుక అణు యుద్ధం జరిగితే.. సగం మానవ జనాభా అంతరించిపోయే ప్రమాదం ఉంది. ఈ మేరకు యుద్ధ ప్రభావంతో ఏయే దేశంలో ఎంతమేర ఆహార పంటలపై ప్రభావం చూపుతుందనే విషయాన్ని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ అట్మాస్పిరిక్‌ రీసెర్చ్‌ ద్వారా సేకరించింది శాస్త్రవేత్తల బృందం.

                                 

About Author