సీట్లు భర్తీ కాకపోతే.. గ్రూప్‌ను తొలగిస్తారా..?
1 min readఎస్.ఎఫ్.ఐ జిల్లా కార్యదర్శి సగిలి రాజేంద్ర ప్రసాద్
పల్లెవెలుగు, మైదుకూరు: ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో 30శాతం సీట్లు భర్తీ కాకుంటే ఆ గ్రూప్ ని ఎత్తివేయడం దారుణమని ఎస్.ఎఫ్.ఐ జిల్లా కార్యదర్శి సగిలి రాజేంద్ర ప్రసాద్, ఎస్.ఎఫ్.ఐ జిల్లా ఉపాధ్యక్షులు గండి సునీల్ కుమార్ అన్నారు. సోమవారం స్థానిక ఎస్.ఎఫ్.ఐ కార్యాలయంలో వారు విలేకరులతో మాట్లాడుతూ.. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఏదైనా గ్రూప్ లో 30 శాతం సీట్లు భర్తీ కాకుంటే ఆ గ్రూప్ ని ఎత్తివేయాలని ఉన్నత విద్యాశాఖ ఆదేశాలు జారీ చేయడం అన్యాయమన్నారు. యూజీసీ నిబంధనల ప్రకారం ఏదైనా గ్రూప్ లో 30శాతం సీట్లు భర్తీ కాకుంటే 3 సంవత్సరాల వరకు గ్రూప్ ను కొనసాగించి ఆ తరువాత మాత్రమే గ్రూప్ ను ఎత్తివేయవచ్చని చెబుతున్నప్పటికీ అందుకు విరుద్ధంగా రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ వ్యవహరించడం దారుణమన్నారు. ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసి ప్రయివేట్ విద్యను ప్రోత్సహించటానికే ప్రభుత్వం పనిచేస్తోందని ఆరోపించారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. సమావేశంలో ఎస్ఎఫ్ఐ నాయకులు ఎర్రంపల్లి ఎద్దు రాహుల్ పాల్గొన్నారు.
Ok thqs very nice