PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఉపాధ్యాయులను మానసికంగా వేధిస్తే ఊరుకోము

1 min read

– ఒక్క నిమిషం ఆలస్యం పేరుతో ఉపాధ్యాయులను వేధిస్తే ప్రతిఘటిస్తాం : STUAP.
పల్లెవెలుగు, వెబ్​ కర్నూలు: రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయులు పాఠశాలలకు ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చారని మెమోలు జారీ చేసి ఉపాధ్యాయులను మానసికంగా వేధిస్తే చూస్తూ ఊరుకోమని ప్రతిఘటిస్తామని ఉపాధ్యాయుల ఉపాధ్యాయ సంఘాల తిరుగుబాటు రుచి చూపిస్తామని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హెచ్. తిమ్మన్న అధికారులను హెచ్చరించారు. ఈ మేరకు కర్నూల్ నగరంలోని సలాం ఖాన్ ఎస్టియు భవనము నందు ముఖ్య కార్యకర్తల సమావేశం జిల్లా ప్రధాన కార్యదర్శి టి .కె. జనార్ధన్ అధ్యక్షతన జరిగినది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హెచ్ తిమ్మన మాట్లాడుతూ పల్నాడు జిల్లా అచ్చంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు కొందరు పాఠశాల విధులకు ఒక నిమిషం ఆలస్యంగా వచ్చారని జిల్లా విద్యాధికారి షోకాజు నోటీసులు, సంజాయిష నోటీసులు జారీ చేయడం అత్యంత హేయమైన చర్యగా భావిస్తున్నామని దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని ఇది ఉపాధ్యాయుల సర్వీస్ నిబంధనలకు సెలవు నిబంధనలకు జీవో నెంబర్ 498 కి విరుద్ధమని వారు తెలిపారు. తక్షణం సంజాయిషీ నోటీస్ లను ఉపసంహ రించాలని డిమాండ్ చేశారు. ఈ జీ.ఓ ప్రకారం ఉపాధ్యా యులకు ముఖ ఆధారిత అప్ లో అంతర్జాల హాజరు నమోదు చేయుటకు పదినిమిషాలు గ్రేస్ పీరియడ్ ఇచ్చారని తెలిపారు. ఒకవేళ ఆ పది నిమిషాల తర్వాత కూడా ఆలస్యంగా వస్తే ఒక నెలలో మూడు సార్లు ఆలస్యంగా వస్తే అర్థపూట సెలవు వేసుకునుటకు ఉపాధ్యాయులకు అవకాశం ఉన్నదని అలాంటప్పుడు చార్జ్ మెమో, శోకాజ్ నోటీసులు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. అధికారుల వైఖరి చూస్తుంటే కేవలం ఉపాధ్యాయులను మానసికంగా వేధించి ఆందోళనకు గురిచేయాలని ఆలోచనలో ఉన్నట్టు తెలియ వస్తుందని దీనికి భయపడే ప్రసక్తే లేదని అవసరమైతే బీఆర్డీఎస్ రోడ్డు ఉద్యమం మాదిరిగా మరొక ఉద్యమాన్ని నిర్మించి అధికారుల యొక్క ఆగడాలను అకృత్యాలను అణిచివేత కార్యక్రమాలను సమాజానికి తెలియజేయ డానికి సిద్ధంగా ఉన్నామని వారు తెలియజేశారు. ఈ ప్రభుత్వం ఉపాధ్యాయులకు న్యాయంగా రావలసిన 11 వివేకాన సవరణ పరువు పద్యం బకాయిలు రూ.మూడు వేల కోట్లు, అదేవిధంగా భవిష్య నిధి జీవిత బీమా నగదు చెల్లింపులు గత సంవత్సర కాలంగా పెండింగ్ ఉన్నాయని, అదే విధంగా జనవరి 1 , 2022 కరువు భత్యం అదేవిధంగా జూలై 1, 2022 కరువు భత్యం దాదాపు 6.37% బకాయిపడి ఉందని ఇది ఎప్పుడు చెల్లిస్తారో చెప్పాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అదేవిధంగా ఉపాధ్యాయులకు పదోన్నతులు బదిలీలు పేరుతో గత నాలుగు నెలలుగా నిత్యం ఏదో ఒక అలజడి సృష్టిస్తూ ఉపాధ్యాయులను ఇబ్బందులకు గురి చేయడం ఇంతవరకు బదిలీల షెడ్యూల్ కూడా ప్రకటించలేకపోవడం అధికారుల యొక్క చేతకానితనం కాదా అనీ ప్రశ్నించారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న కస్తూరిబా ఉపాధ్యాయులకు 11వ వేతన సవరణ కమిషన్ సిఫారసుల మేరకు కనీస వేతన చట్టం అమలు చేయాలన్నారు. అదేవిధంగా ప్రభుత్వంలో విలీనమైనటు వంటి ఎయిడెడ్ ఉపాధ్యా యులకు హెల్త్ కార్డులు భవిష్యనిది జీవిత బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా గురుకులాలు, ఎయిడెడ్ ఉపాధ్యాయులకు పదవి విరమణ వయసు 62 సంవత్సరాలు పెంపుదల చేయడానికి ఇంకెంతకాలం పడుతుందని ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు జీరో వన్ జీరో (010) హెడ్ జీతాలు పదోన్నతులు కల్పించాలని, ప్రభుత్వంలో విలీనమైనటు వంటి మున్సిపల్ ఉపాధ్యా యులకు భవిష్య నిధి హెడ్మాస్టర్లకు డ్రాయింగ్ పవర్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా 2008 డీఎస్సీ ఉపాధ్యాయులకు రెగ్యులర్ స్కేలు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ మేరకు కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం రద్దుచేసి రాజస్థాన్ ఛత్తీస్గడ్ పంజాబ్ రాష్ట్ర తరహాలో పాత పెన్షన్ విధానాన్ని కొందరుద్ధరించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 13 లక్షల మంది ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లకు ముఖ్యమంత్రి హామీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఎస్టీయు నాయకులు నారాయణస్వామి, ప్రసాదు రామాంజనేయులు, గోవిందు, రాముడు తదితరులు పాల్గొన్నారు.

About Author