NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రెండు రాష్ట్రాలు క‌లిసిపోతే.. కేసీఆర్ భేషుగ్గా ఏపీలో పోటీ చేయ‌వ‌చ్చు !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: ఆంధ్రాలో కేసీఆర్ పార్టీ పెట్టాల‌ని తామూ కోరుకుంటున్నట్టు ఏపీ మంత్రి పేర్ని నాని తెలిపారు. ఏపీ, తెలంగాణ క‌లిసిపోతే కేసీఆర్ భేషుగ్గా పోటీ చేయ‌వ‌చ్చని అన్నారు. ఏపీ, తెలంగాణ ఒక‌టిగా ఉండాల‌ని సీఎం జ‌గ‌న్ గ‌తంలో కోరుకున్నార‌ని తెలిపారు. కేబినెట్ భేటీ త‌ర్వాత పేర్ని నాని ఈ విష‌యం పై స్పందించారు. కేబినెట్ నిర్ణయాల‌ను వెల్లడించారు. ఏపీలో కొత్తగా నాలుగు వేల ఉద్యోగాల భ‌ర్తీకి కేబినెట్ నిర్ణయం తీసుకుంద‌ని తెలిపారు. ఆన్ లైన్ టికెట్ల విక్రయానికి వీలుగా సినిమాటోగ్రఫీ చ‌ట్టస‌వ‌ర‌ణ ఆర్డినెన్స్ కు మంత్రివ‌ర్గం ఆమోదముద్ర వేసిన‌ట్టు పేర్ని నాని తెలిపారు. అమ్మ ఒడికి 75 శాతం హాజ‌రు త‌ప్పనిస‌రి చేసిన‌ట్టు ఆయ‌న తెలిపారు.

About Author