NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వ్యాక్సిన్ వేయించుకోక‌పోతే.. ఉద్యోగం ఇవ్వరు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: క‌రోన క‌ట్టడికి వ్యాపారులు వినూత్న నిర్ణయం తీసుకున్నారు. వ్యాక్సిన్ వేయించుకోక‌పోతే.. త‌మ దుకాణాల్లో ఉద్యోగం ఇచ్చేది లేద‌ని తేల్చి చెప్పారు. మ‌ధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో వ్యాపారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇండోర్ లో లాక్ డౌన్ ను స‌డ‌లిస్తున్నారు. ద‌శ‌ల‌వారీగా లాక్ డౌన్ ను అన్ లాక్ చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో మార్కెట్ కు వ‌చ్చే వారికి త‌ప్పనిస‌రిగా శానిటైజ‌ర్ వాడేలా చ‌ర్యలు తీసుకుంటామ‌ని చెప్పారు. భౌతిక దూరం పాటించేలా చ‌ర్యలు తీసుకుంటున్నామ‌ని స్థానిక వ్యాపారులు చెబుతున్నారు. కొంత మందికి ఇబ్బంది క‌లిగించినా స‌రే.. ప్రజ‌ల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని క‌ఠిన‌మైన నిర్ణయాలు తీసుకుంటున్నట్టు ఇండోర్ వ్యాపారులు చెబుతున్నారు.

About Author