PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వేతనాలు పెంచకపోతే ఉద్యమాన్ని ఉదృతం చేస్తాం

1 min read

న్యాయమైన వేతనాలపై  కార్మికవర్గం మద్దతుగా ఉండాలి

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: అంగన్వాడి కార్మికులకు న్యాయమైన వేతనాలు అందే వరకు సమ్మె కొనసాగుతుందని ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని అమలు చేయాలని కార్మికులు కోరుతున్నారని తక్షణమే కనీస వేతనం అమలు చేసి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గ్రాట్యూటీ చెల్లించాలని ఎన్ని నిర్భందాలు పెట్టిన సమ్మె కొనసాగుతుందని చర్చలు చేయకుండా బెదిరింపులకు పాల్పడితే కార్మికులు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు రఘురాం మూర్తి,రాష్ట్ర కార్యదర్శి ఎం రమేష్ బాబు లు హెచ్చరించారు.శుక్రవారం నందికొట్కూరు పట్టణం లోని ఐకె పి కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు .ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు రఘురాం మూర్తి,రాష్ట్ర కార్యదర్శి ఎం.రమేష్ బాబు లు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న లక్ష మంది అంగన్వాడీ కార్మికులు తమ న్యాయమైన వేతనాల పెంపు పై నాలుగున్నర సంవత్సరాలుగా శాంతియుతంగా ఆందోళన చేస్తూ ప్రభుత్వానికి తెలియజేస్తున్నారని, అధికారులను మంత్రులను కలిసి విన్నవిస్తున్నారని అయినా కూడా ప్రభుత్వంలో చలనం లేదన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ కంటే వెయ్యి రూపాయల వేతనం అదనంగా ఇస్తానన్న హామీని అమలు చేయాలని కార్మికుల కోరుతున్నారన్నారు. న్యాయమైన వేతనాలు పెంచాలని అడిగితే సచివాలయం ఐకెపి సిబ్బందితో వారిని విడదీయడం తగదన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గ్రాట్యూటీ ని అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు.పేస్ యాఫ్ రద్దు చేయాలన్నారు.. కార్మికులు అడిగే న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకుండా సమ్మెను తప్పుదోవ పట్టించేందుకు అధికార యంత్రంగాం చూడడం తగదు అన్నారు. సమస్యలు పరిష్కరించి సమ్మె విరమించాలణే ప్రయత్నం చేయకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న అధికారుల మధ్య విభేదాలు సృష్టించే పద్ధతి మానుకోవాలన్నారు.ఏమైనా సమస్యలు పరిష్కరించేంతవరకు ఎన్ని బెదిరింపులకు పాల్పడిన దౌర్జన్యం చేసిన సమ్మె కొనసాగుతుందని వారు అన్నారు.ఈ కార్యక్రమం లో ఏపీ మహిళా సమాఖ్య తాలూకా కార్యదర్శి రజితమ్మ, ఏఐవైయఫ్ తాలూకా నాయకులు వెంకటేష్ , అంగన్వాడీ యూనియన్ నాయకులు పుణ్యవతి, కమలమ్మ,సువర్ణ, కాత్యాయనీ, నాగేశ్వరామ్మ,సుబ్బమ్మ , భాగ్యమ్మ , కార్మికులు పాల్గొన్నారు.

About Author