సమస్యలు ఉంటే చెప్పండి పరిష్కరిస్తా..
1 min read– ప్రజలను కోరిన ఎమ్మెల్యే గంగుల.
పల్లెవెలుగు, వెబ్ రుద్రవరం: ప్రజా సమస్యలను పరిష్కరించేందుకే గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని సమస్యలు ఉంటే చెప్పాలని ఎమ్మెల్యే గంగుల బిజేంద్రరెడ్డి ప్రజలను కోరారు. ఆళ్లగడ్డ శాసనసభ్యులు గంగుల బిజేంద్ర రెడ్డి స్వగ్రామైన మండలంలోని యర్రగుడిదిన్నె గ్రామంతో పాటు మజర గ్రామమైన మాచినేనిపల్లె గ్రామంలో గురువారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గడపగడపకు వెళ్లి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయా లేదా అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. కాలనీలో డ్రైనేజీ ఏర్పాటు చేయాలని గృహ నిర్మాణ బిల్లులు అందడం లేదని వీధి దీపాలు ఏర్పాటు చేయాలని మాచినేని పల్లె గ్రామంలో దళితులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడంతో స్పందించిన ఆయన సమస్యలను వెంటనే పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. పింఛన్ రావడం లేదంటూ వృద్ధురాలు ఓ వికలాంగ బాలిక తండ్రి ఎమ్మెల్యే దృష్టికి తీసుకు వచ్చారు దీంతో ఆయన వారిని సదరన్ క్యాంపుకు పంపేందుకు ఏర్పాట్లు చేసి అనంతరం వారికి పింఛన్ అందించేందుకు చర్యలు తీసుకోవాలని సిబ్బంది గ్రామ వాలంటీర్లను ఆదేశించారు. ఎమ్మెల్యే స్వగ్రామమైన యర్రగుడిదిన్నె గ్రామంలో నిర్వహించిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో సంక్షేమ పథకాలపై ప్రజలకు వివరించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అందించే దిశగా చర్యలు తీసుకోవాలని గ్రామంలో ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే వెంటనే వాటిని పరిష్కరించే దిశగా ముందుకు వెళ్లాలని ఆ శాఖ అధికారులను సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలను తెలుసుకుని వెంటనే పరిష్కరించేందుకే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టినాటి నుండి నేటి వరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఎన్నికలలో హామీ ఇచ్చిన పథకాలతో పాటు అదనంగా పథకాలను ప్రవేశపెట్టి అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందించడం జరుగుతోందన్నారు. ప్రజలను అభివృద్ధి వైపు ముందుకు తీసుకెళ్లేందుకు వైసిపి ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో పుటాలమ్మ క్షేత్రం చైర్మన్ ఆళ్లగడ్డ నియోజకవర్గం వైసీపీ సీనియర్ నాయకుడు గంగుల మనోహర్ రెడ్డి, గ్రామ సర్పంచ్ ఆలమూరు చిన్నకేశాలు, ఎంపీటీసీ సింగ రాజేశ్వరి, మండల నాయకులు గంధం రాఘవరెడ్డి, మాచినేనిపల్లె మోహన్, చాగలమర్రి మండల నాయకుడు బాబులాల్, పుల్లారెడ్డి, కృష్ణారెడ్డి, సుదర్శన్ రెడ్డి, మాజీ సర్పంచ్ శీలయ్య, నరసాపురం మాజీ సర్పంచ్ ప్రసాద్ రెడ్డి, సింగిల్ విండో అధ్యక్షుడు నాగేశ్వరరరెడ్డి, తహాశీల్దార్ వెంకటశివ, ఎంపీడీవో మధుసూదనరెడ్డి, ఈవోపీఆర్డి భాగ్యలక్ష్మి, ఏఈలు వెంకటరాముడు, ప్రమోద్, మూర్తి, గంగుల రాఘవేంద్రరెడ్డి, వ్యవసాయ అధికారి శ్రీకృష్ణ, ఎస్సై నిరంజన్ రెడ్డి, ఐసిడిఎస్ సూపర్వైజర్ పద్మావతి పంచాయతీ కార్యదర్శి జయరాముడు, హౌసింగ్ సిబ్బంది, వ్యవసాయ సిబ్బంది, ఉపాధి సిబ్బంది, వైయస్సార్ కాంతి పథకం సిబ్బంది, అంగన్వాడి సిబ్బంది, సచివాలయం సిబ్బంది వైద్య సిబ్బంది ఆశా కార్యకర్తలు గ్రామ వాలంటీర్లు పోలీసులు తదితరులు పాల్గొన్నారు.