NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఉద్యోగాలు వ‌స్తే.. పానీపూరీ ఎందుకు అమ్ముతున్నారు ?

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : త‌మిళ‌నాడు విద్యాశాఖ మంత్రి కే. పొన్నుడి సంచ‌ల‌న వ్యాక్య‌లు చేశారు. కోయంబ‌త్తూర్‌లోని భార‌తీయ‌ర్ యూనివ‌ర్సిటీలో శుక‍్రవారం జ‌రిగిన స్నాత‌కోత్స‌వ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి కే పొన్నుడి మాట్లాడుతూ.. హిందీ మాట్లాడేవారు కోయంబ‌త్తూర్‌లో పానీపూరీలు అమ్ముకుంటున్నార‌ని ఎద్దేవా చేశారు. హిందీ భాష మరిన్ని ఎక్కువ ఉద్యోగాలు కల్పించేదే అయితే ఉత్తర భారతీయులు ఇక్కడ పానీ పూరీ ఎందుకు అమ్ముకుంటున్నారని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే త‌మిళ‌నాడు ప్ర‌జ‌లు ఇంగ్లీష్‌, త‌మిళ్ మాట్లాడుతారని అన్నారు. అలాగే, తాము అంత‌ర్జాతీయ భాష‌గా ఇంగ్లీష్ నేర్చుకుంటుండ‌గా ఇత‌ర భాషల‌తో ప‌నేముందని మంత్రి ఆయ‌న ప్ర‌శ్నించారు.

                               

About Author