‘ధరణి’లో సమస్యలుంటే.. చెప్పండి
1 min read– కలెక్టర్ ఎస్. వెంకటరావు
పల్లెవెలుగు వెబ్, మహబూబ్నగర్ : ధరణి పోర్టల్లో ఏవైనా సమస్యలు వచ్చినట్లయితే తమ దృష్టికి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట ర్రావు అన్నారు. మంగళవారం ఆయన మూసాపేట మండల తాసిల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. తాసిల్దారు మంజుల తో మాట్లాడుతూ ధరణి లో ఎన్ని స్లాట్స్ బుక్ అయ్యాయి? రిజిస్ట్రేషన్లు ఎలా నడుస్తున్నాయి? ఏవైనా సాఫ్ట్వేర్ సమస్యలు ఉన్నాయా ?రోజుకు ఎన్ని రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి ?అని అడిగారు. ఇందుకు తహసీల్దార్ స్పందిస్తూ కరోనా కారణంగా రిజిస్ట్రేషన్లు పూర్తిగా తగ్గిపోయాయని, ఇప్పటివరకు కేవలం రెండు స్లాట్ లు మాత్రం రిజిస్ట్రేషన్ కోసం బుక్ అయ్యాయని తెలిపారు. తమ మండలంలో ధరణి లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా నడుస్తున్నదని, ఎలాంటి సాఫ్ట్ వేర్ సమస్యలు కూడా లేవని ఆమె కలెక్టర్ కు తెలిపారు. ఏవైనా సాంకేతిక సమస్యలు ఉన్నట్లయితే తక్షణమే తన దృష్టికి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.ధరణి పోర్టల్ లో బుక్ అయిన స్లాట్స్ ఇప్పటికప్పుడే పూర్తి చేయాలని, పెండింగ్లో ఉంచ వద్దని జిల్లా కలెక్టర్ తహశీల్దార్ను ఆదేశించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో హరిత హారం కింద నాటిన మొక్కలకు నీరు పెట్టారు.