PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

తేడా వస్తే సోడాతో కొడుతుంది..

1 min read

సినిమా డెస్క్​: ‘వి’ సినిమాతో అలరించిన సుధీర్ బాబు ఇప్పుడు ‘శ్రీదేవి సోడా సెంటర్’తో వస్తున్నాడు. విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్నారు. ‘పలాస 1978’ ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటి వరకూ రివీల్‌ చేయకుండా దాచేసిన హీరోయిన్‌ని చూపించేశారు. ఆనంది పేరుని హీరోయిన్ గా అనౌన్స్ చేయడంతో పాటు ఆమె పాత్రని కూడా పరిచయం చేస్తూ టీజర్ విడుదల చేశారు. చలాకీగా ఉంటూ తన అందంతో అచ్చమైన పల్లెటూరి అమ్మాయిగా ఆకట్టుకుంది ఆనంది. అంతేకాదు తన వెంట పడుతున్న ఓ కుర్రాడి తలపై సోడా పగలగొట్టడం వల్లే తనపేరు సోడాల శ్రీదేవి అయిందంది. ఆమెని తనతో లవ్‌లో దింపేందుకు ఆ సోడా సెంటర్ చుట్టూ చక్కర్లు కొడుతున్న లైటింగ్ సూరిబాబుగా సుధీర్ బాబు కనిపిస్తున్నాడు.

About Author