NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అర్హుల, అనర్హులా జాబితా పై అభ్యంతరం ఉంటే.. తెలపండి: ఏ. డి. విజయ

1 min read

పల్లెవెలుగు , కర్నూలు : అంధులు (VH), బధిరులు (HH) మరియు శారీరక విభిన్న ప్రతిభావంతులు (దివ్యాంగులు) (OH) బ్యాక్ గ్ డి.యస్.సి. (1) జూనియర్ అసిస్టెంట్ (OH-Gen), (2) జూనియర్ అసిస్టెంట్ (HH-Gen), (3) జూనియర్ ఆడిటర్ (HH-Gon) మరియు (4) టైపిస్టు (VH-W) ఉద్యోగాలకు సంబంధించిన అర్హులు జాబితా’ మరియు తిరస్కరణ జాబిత వివరములు సహాయ సంచాలకులు, విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాల మరియు వయో వృద్ధుల సంక్షేమ శాఖ, కర్నూలు కార్యాలయంలోని నోటీసు బోర్డు నందు మరియు డిస్ట్రిక్ వెబ్సైట్ www.kurnool.ap.gov.in నందు ఉంచడమైనదని ఏ. డి. విజయ ఒక ప్రకటనలో తెలిపారు. నోటీసు బోర్డు మరియు వెబ్సైట్ నందు వుంచిన వివరాలలో ఏవేని ఆక్షేపణలు ఉన్నచో తేది: 20-10-2021 సాయంత్రము 5.00 గంటల లోపల సహాయ సంచాలకులు, విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాల మరియు వయో వృద్ధుల సంక్షేమశాఖ, కర్నూలు వారికి లిఖిత పూర్వకంగా ఈ కార్యాలయవు మెయిల్ ఐడి: [email protected] నందు/ద్వారా తగిన ఆధారములతో తెలియజేయవచ్చును లేదా మీ వినతి పత్రాన్ని నేరుగా గాని (కోవిడ్-19 నిబంధనల మేరకు), పోస్టు ద్వారా గాని ఈ కార్యాలయపు పని వేళల యందు సమర్పించవచ్చును. గడువు మీరిన పిదవ వచ్చు ఆక్షేపణలు పరిగణలోనికి తీసుకొనబడవని స్పష్టం చేశారు.

About Author