PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

చిరంజీవి సినిమాలో ఆఫ‌ర్ వ‌స్తే రాజ‌శేఖ‌ర్ న‌టిస్తారు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : రాజశేఖర్‌ హీరోగా జీవిత దర్శకత్వం వహించిన ‘శేఖర్‌’ చిత్రం ఈ నెల 20న విడుదల కానున్న సందర్భంగా ఆమె ఆదివారం విలేకర్లతో మాట్లాడారు. ‘‘పరిశ్రమలో మాకు ఎవరితోనూ ఏ ఇష్యూ లేదు. చిరంజీవి గారితో ఎప్పుడో జరిగిన వివాదాన్ని రిపీట్‌ చేస్తూ యూట్యూబ్‌ మాధ్యమంలో తంబ్‌నైల్స్‌ పెట్టి చిరంజీవిగారికి, మాకు మధ్య దూరం పెంచుతున్నారు. మేమంతా బాగానే ఉన్నాం. చిరంజీవి గారు ఆయన నటించే చిత్రాల్లో ఆఫర్‌ ఇస్తే రాజశేఖర్‌ చేయడానికి సిద్థంగా ఉన్నారు. రాజశేఖర్‌ నెగటివ్‌ రోల్స్‌ చేస్తారా అని చాలామంది అడుగుతున్నారు. ‘ధ్రువ’లోని అరవిందస్వామి, ‘పెదరాయుడు’లో రజనీకాంత్‌ లాంటి పాత్రలు వస్తే తప్పకుండా చేస్తారు. మంచి పాత్రలు వస్తే నేను సినిమాల్లో నటించడానికి రెడీగా ఉన్నా’’ అని జీవిత చెప్పారు.

                                   

About Author