PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రేమ ఉంటే.. బీసీల‌ను ముఖ్య‌మంత్రి చేయండి !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు సోము వీర్రాజు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. సీఎం జగన్‌కు బీసీలపై ప్రేమ ఉంటే బీసీ అభ్యర్థిని సీఎం చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్ చేశారు. మళ్లీ అధికారంలోకి రావాలనే దురాలోచనతోనే కేబినేట్‌ విస్తరణలో బీసీలకు ఎక్కువ ప్రాతినిధ్యం ఇచ్చామని ఆయన విమర్శించారు. సోమవారం ఆయన మీడియాతో పాలనాధికారం బీసీలకు అప్పగించి జగన్‌ ఉపముఖ్యమంత్రిగా ఉండాలని తాము కోరుకుంటున్నానని, ఇలా చేస్తారా లేదా అనేది జగన్‌ ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. బీసీల విషయంలో ఆత్మశుద్ధి ఉండాలని, కేవలం అధికారంలోకి రావడానికి వారిని వినియోగించవద్దన్నారు.

                      

About Author