PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఈ స‌వాళ్ల‌ను అధిగ‌మిస్తే.. భార‌త్ కు పెద్ద క‌ష్టం కాదు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : మరో ఆరేళ్లలో భారత ఆర్థిక వ్యవస్థను ఐదు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడం పెద్ద కష్టంకాదని భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ మాజీ గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు అన్నారు. కాకపోతే ఇందుకోసం వచ్చే ఐదేళ్లలో మన జీడీపీ ఏటా 9 శాతం చొప్పున పెరగాల్సి ఉంటుందన్నారు. స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా తెలంగాణ పారిశ్రామిక, వాణిజ్య సంఘాల సమాఖ్య (ఎఫ్‌టీసీసీఐ) ఏర్పాటు చేసిన ఒక సదస్సులో ఆయన ఈ విషయం స్పష్టం చేశారు. ఈ క్రమంలో భారత్‌ ఎనిమిది సవాళ్లను అధిగమించాల్సి ఉంటుందన్నారు. పెట్టుబడులు, ఉత్పాదకత, విద్య, వైద్య సదుపాయాల పెంపు, ఉద్యోగాల కల్పన, వ్యవసాయ ఉత్పాదకత పెంపు, స్థూల ఆర్థిక స్థిరత్వం, పాలనా వ్యవస్థను మెరుగుపరుచుకోవడం, అంతర్జాతీయ ఆటుపోట్ల నిర్వహణ ఈ ప్రధాన సవాళ్లు అన్నారు.

                                                         

About Author