ఈ లక్షణాలు ఉంటే చాలు..చికిత్స !
1 min readపల్లెవెలుగు వెబ్: కరోన లక్షణాలు కనిపిస్తే చాలు చికిత్స చేయాలని కేంద్ర కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ స్పష్టం చేసింది. ఆర్టీపీసీఆర్ పాజిటివ్ రిపోర్ట్ వచ్చే వరకు ఆగకుండా ఆస్పత్రుల్లో కోవిడ్ చికిత్స అందించాలని చెప్పింది. పాజిటివ్ రిజల్ట్ రావడానికి నాలుగురోజుల సమయం పడుతుంది. ఈలోపు కోవిడ్ బాధితుల పరిస్థితి విషమించే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కేంద్రం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. జ్వరం, జలుబు, దగ్గు, గొంతు నొప్పి ఉన్నవారికి తక్షణమే ఆస్పత్రుల్లో చేర్చుకుని చికిత్స ప్రారంభించాలని కేంద్రం తెలిపింది. స్వల్ప లక్షణాలు ఉన్నా.. రిజల్ట్ నెగిటివ్ వచ్చి లక్షణాలు ఉన్న చికిత్స అందించాలని చెప్పింది. ఫలింతగా ప్రాణ నష్టాన్ని నివారించవచ్చని తెలిపింది. కోవిడ్ పరీక్షల్లో జరుగుతన్న ఆలస్యం ద్వార జరిగే నష్టాన్ని నివారించడానికి కేంద్రం ఈ చర్యలు తీసుకుంది.