ఈ మూడూ ఉంటే.. మనిషి 150 ఏళ్లు బతకొచ్చు !
1 min read
పల్లెవెలుగు వెబ్ : మనిషి జీవితకాలం 100 ఏళ్లు అనుకుంటాం. అంతకంటే ఎక్కువ బతకాలంటే చాలా కష్టం. 60 ఏళ్లు రాగానే మనిషి ముసలితనం వచ్చిందన్న అభిప్రాయంలోకి వెళ్తాడు. కానీ కొన్ని కీలకమైన పద్దతులు పాటిస్తే మనిషి 150 ఏళ్లు బేషుగ్గా బతకొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సింగపూర్, రష్యా, అమెరికన్ శాస్త్రవేత్తల అధ్యయనం ప్రకారం మనిషి 150 ఏళ్లు బతకొచ్చని చెప్పారు. దీర్ఘకాలం జీవించాలని అనుకునే వారికి పరిశోధకులు మూడు విషయాలు చెప్పారు.
- మంచి జన్యువులు ఉండాలి. వందేళ్లు పైగా బతకడానికి ఇవి ఎంతో కీలకం.
- అద్భుతమైన ఆహార-వ్యాయామ ప్రణాళిక. దీన్ని పాటిస్తే మరో 15 ఏళ్లు ఎక్కువ బతకొచ్చు.
- మంచి చికిత్స , ఔషధాలు. ఇవి నాణ్యమైన జీవనాన్ని కొనసాగేలా చేస్తాయి.