బెదిరిస్తే ఎవరూ బెదిరిపోరు !
1 min readపల్లెవెలుగువెబ్ : టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు సీఎం జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. పాలనలోని లోపాలపై ప్రశ్నించడం రాజ్యాంగం కల్పించిన హక్కు అని, వాటిని సరి చేసుకోవాలే తప్ప..ఎత్తిచూపిన వారిపై దాడులు చేయడం మరో తప్పు అని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. ‘‘రెచ్చగొట్టే కొద్ది జనం రెచ్చిపోతారు. బెదిరిపోతారు అనుకోవడం తప్పు. మీ వెంట్రుకలు ఎవరో పీకుతాడనే భయం పట్టుకుంది. అందుకే ప్రతి మీటింగ్‌లోనూ నా వెంట్రుకలు ఎవరూ పీకలేరని మాట్లాడుతున్నారు. ప్రధానమంత్రి భీమవరం వస్తుంటే.. స్థానిక ఎంపీని రాకుండా అడ్డుకోవడం దారుణం. రాష్ట్రంలో దౌర్జన్య పాలన జరుగుతుంది. ప్రధానమంత్రి కలగజేసుకోవాలి. ఉన్నతాధికారులతో చర్చించుకుండానే ఉన్నఫలంగా ఆర్టీసీ బస్సు చార్జీలను పెంచేశారు.’’ అని అయ్యన్న గుర్తు చేశారు.