బెదిరిస్తే నా మెయిల్ కు ఫిర్యాదు పంపండి : సుజనా చౌదరి
1 min read
పల్లెవెలుగువెబ్ : ఏపీలో సీఎం, మంత్రుల పేరుతో బెదిరింపులు పెరిగాయని ఎంపీ సుజనా చౌదరి అన్నారు. ఎంపీల పేర్లతో కబ్జాలకు పాల్పడటం రివాజుగా మారిందన్నారు. విశాఖలో జగదీశ్వరుడు, ఒంగోలులో సుబ్బారావు గుప్తాలపై జరిగిన దాడి అరాచకానికి ప్రతీక అని అన్నారు. తక్షణమే జగన్ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని కోరారు. వేధింపులకు భయపడకుండా బాధితులు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయాలని సూచించారు. ఫిర్యాదు కాపీలు తనకు పంపాలని.. అండగా ఉంటానని సుజనా చౌదరి హామీ ఇచ్చారు. ఆ కాపీలను [email protected] కు పంపాలని సూచించారు.