వాలంటీర్లు, ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే చర్యలు తప్పవు
1 min readజిల్లా కలెక్టర్ డా.జి.సృజన
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు వాలంటీర్లు, ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ డా.జి.సృజన ఒక ప్రకటనలో హెచ్చరించారు.ఎన్నికల ప్రచారంలో వాలంటీర్లు పాల్గొంటే ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు విధుల నుండి తొలగించడం జరుగుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు.. ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే వెంటనే సస్పెండ్ చేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ఇలాంటి ఫిర్యాదులు ఏవైనా ఉంటే కర్నూలు జిల్లా టోల్ ఫ్రీ నెంబర్ : 1800 425 7755 కు కానీ, కాల్ సెంటర్ : 08518-220125 నెంబర్లకు ఫోన్ చేసి తెలియచేయవచ్చని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.