NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సొంత‌వారే పోరాడ‌కుంటే.. మా బిడ్డల‌ను యుద్ధానికి పంపాలా ?

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : ఆఫ్ఘనిస్థాన్ సైనికులే సొంత దేశంలో జ‌రుగుతున్న అంత‌ర్యుద్ధంలో పోరాడ‌డంలేద‌ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. అలాంటి యుద్ధంలో పోరాడ‌డానికి ఎంత మంది అమెరికా బిడ్డల‌ను పంపాల‌ని జో బైడెన్ ప్రశ్నించారు. ఆప్ఘన్ లో అమెరికా ద‌ళాల‌ను వెన‌క్కి తీసుకోవ‌డాన్ని వ్యతిరేకిస్తున్నవారికి ఇదే త‌న ప్రశ్న అని జో బైడెన్ తెలిపారు. ఈ నిర్ణయం పై తాను చింతించ‌డంలేద‌ని, అమెరికాకు ఇదే స‌రైన నిర్ణయ‌మ‌ని తెలిపారు. అమెరికా పై ఉగ్రదాడులు నిరోధించ‌డ‌మే త‌మ ల‌క్ష్యమ‌ని జో బైడెన్ స్పష్టం చేశారు. త‌న ముందు రెండే మార్గాలు ఉన్నాయ‌ని ఆయ‌న అన్నారు. ఒక‌టి ఆఫ్గన్ లో అమెరికా ద‌ళాల‌ను కొన‌సాగించ‌డం.. రెండోది మూడో ద‌శాబ్దంలో కూడ యుద్ధాన్ని కొనసాగించ‌డ‌మ‌ని జో బైడెన్ అన్నారు.

About Author