PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఈ యాప్ ఉంటే.. మ‌న వెంట పోలీస్ ఉన్న‌ట్టే !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఏపీ పోలీస్ యాప్‌ కొండంత ధైర్యాన్ని ఇస్తుంది. ఎటువంటి ప్రమాదం, సమస్య వచ్చినా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లకుండానే క్షణాల్లో పోలీసులకు ఫిర్యాదు చేసే అద్బుతమైన అవకాశం ఇందులో ఉంది. అన్ని పోలీస్‌ స్టేషన్లను అనుసంధానిస్తూ ఈ యాప్‌ రూపొందించారు. ఈ యాప్‌ను ఫోన్లో ఇన్‌స్టాల్‌ చేసుకుంటే.. పోలీస్‌స్టేషన్‌ ద్వారా లభించే అన్ని రకాల సేవలను ఇంటి దగ్గర నుంచే పొందవచ్చు. పోలీస్‌ సేవ యాప్‌ ద్వారా ఉన్న చోట నుంచే వేధింపులు, నేరాలు, ట్రాఫిక్‌ ఇబ్బందులు, పోలీస్‌ సేవల్లో లోపాలపై ఫిర్యాదులు చేయవచ్చు. ఫిర్యాదు చేసిన వెంటనే ఐడీ నంబర్‌తో సహా ఫిర్యాదుదారుడి మొబైల్‌కు మెసేజ్‌ వస్తుంది. అలాగే సమస్యను ఎన్ని రోజుల్లో పరిష్కరిస్తారనే విషయాన్ని కూడా మెసేజ్‌లో తెలియజేస్తారు. పిటిషన్‌ ఏ స్థాయిలో ఉందనే విషయాన్ని సైతం ఎప్పటికప్పుడు తెలుసుకునే వెసలుబాటును కల్పించారు.

                                  

About Author