ఇష్టంగా పని చేస్తే అదే మనకు స్వాతంత్ర్యం
1 min readపల్లెవెలుగు వెబ్ మిడుతూరు: మిడుతూరు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు మంగళవారం ఉదయం 8 గంటలకు ఘనంగా జరిగాయి. మండల తహసిల్దార్ ఎస్.ప్రకాష్ బాబు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు.అనంతరం తహసిల్దార్ మాట్లాడుతూ ఆగస్టు 15-1947 బ్రిటిష్ పాలకుల నుంచి భరత మాతకు విముక్తి కలిగిన రోజు అని ఎంతోమంది త్యాగాల ఫలితమే భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినదని ఈ రోజున యావత్ భారతదేశం 77వ స్వాతంత్రం దినోత్సవాలను ఎక్కడ చూసినా ప్రభుత్వ మరియు ప్రైవేటు కార్యాలయాల్లో జాతీయ జెండాను మనం ఎగుర వేస్తున్నామంటే బ్రిటిష్ కాలం నాటి స్వాతంత్ర్య సమరయోధులు ప్రాణాలను లెక్కచేయకుండా వారి ప్రాణాలను అర్పించినందునే మనం జాతీయ జెండాను ఎగురవేస్తున్నామని తహసిల్దార్ అన్నారు.తర్వాత పేద బడుగు బలహీన వర్గాలు మరియు అనగారిన వర్గాలు మనకు స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు అయినప్పటికీ ఇంకా వెనుక బాటునే ఉన్నారని ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఎంతో ఉందని ప్రతి అధికారి ప్రజలకు మంచి పని చేసేటప్పుడు ఇష్టంతోనే పని చేయాలని కష్టంతో పని చేయకూడదని అదేవిధంగా ప్రభుత్వం యొక్క ఆశయాలను ప్రతి పౌరునికి అందే విధంగా చూడటమే మన కర్తవ్యమని డిప్యూటీ తహసిల్దార్ షాన్వాజ్ అన్నారు.ఈకార్యక్రమంలో సర్వే డిప్యూటీ తహసిల్దార్ సోమేశ్వరి,ఆర్ఐ బాష, సీనియర్ అసిస్టెంట్ రాంభూపాల్ రెడ్డి,విఆర్వోలు ఆంజనేయులు,వెంకటయ్య,రాఘవేంద్ర,ఖాదర్ బాష,రహీం భాష,రామయ్య,రమణారెడ్డి, ప్రసాదరావు మరియు పోలీసు సిబ్బంది,విఆర్ఏలు వెంకటేశ్వర్లు,వెంకటేష్, తిరుపాలు,శ్రీనివాసులు,భూషన్న కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.