ఇష్టను సరంగా మా నాయకుని గురించి మాట్లాడితే చూస్తూ ఊరుకోం..
1 min read
ఆదోని ఎమ్మెల్యే పై విరుచుకు పడ్డ జిల్లా ఉపాధ్యక్షులు,హొళగుంద వైస్సార్సీపీ మండల కన్వీనర్
హొళగుంద, న్యూస్ నేడు: హొళగుందల కేంద్రం లో వైస్సార్సీపీ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు యస్ కె గిరి మరియు మండల కన్వీనర్ సఫి ఉల్లా మాట్లాడుతూ కర్నూల్ లో డిఆర్సి సమావేశం లో ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి మాట్లాడుతు ఆలూరు నియోజకవర్గం లో ఉండే తాగునీరు, సాగు నీరు గురించి జిల్లా ఇంచార్జ్ ,కలెక్టర్కి చెపుతుంటే మధ్యలో దూరి మైకు తీసుకొని ఇష్ట ను సరంగా అధికారం అహంకారం తో మా నాయకుని గురించి మాట్లాడితే ఎవరు కూడా చూస్తూ ఊరుకోరు, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది, నీకు రాబోయే స్థానిక ఎన్నికలో ఆదోని నియోజకవర్గ ప్రజాలు తగిన గుణ పాఠం చెపుతారు అని అన్నారు, ఈ కార్యక్రమం లో వైస్సార్సీపీ సీనియర్ నాయకుడు శేషప్ప, మంజునాయక్, కో కన్వీనర్ లక్ష్మణ్, గోవిందు, వెంకటేష్, పంపపాతి, హనుమప్ప, రఫిక్, రాంతుల్ల,సిద్దప్ప,లింగంపల్లి మౌనేష్ , తదితరులు పాల్గొన్నారు.
