వ్యాక్సిన్ వేసుకున్నా.. మాస్కులు పెట్టుకోండి !
1 min readపల్లెవెలుగు వెబ్ : అమెరికాలో డెల్టా వేరియంట్ విళయ తాండవం చేస్తోంది. పూర్తిగా వ్యాక్సినేషన్ జరిగిన తర్వాత కూడా ప్రజలు మాస్కులు ధరించడమే మంచిదని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) సూచించింది. కరోనా హాట్‌స్పాట్లలో ఉండే వ్యక్తులు రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నా సరే మాస్కులు ధరించాలని సీడీసీ తెలిపింది. మే నెలలో వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న వాళ్లకు మాస్కులతో పనిలేదని సీడీసీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే డెల్టా విజృంభణతో సీడీసీ తన నిర్ణయం మార్చుకుంది. కే-12 స్కూళ్లలో పనిచేసే టీచర్లు, విద్యార్థులు బహిరంగ ప్రదేశాల్లోనే కాకుండా స్కూళ్లలో కూడా మాస్కులు ధరించాలని సీడీసీ పేర్కొంది.