PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కనీస వేతనాలు అడిగితే… అరెస్టులా… : ఏఐటీయూసీ

1 min read

పల్లెవెలుగు వెబ్​: కనీస వేతనాలు చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలన్న డిమాండ్లతో రాష్ట్ర వ్యాప్త ధర్నాకు బయలుదేరుతున్న ఆశా, అంగన్​వాడీ, మధ్యాహ్నభోజన కార్మికులు, కార్మిక నాయకులను హౌస్​ అరెస్టు చేయడం దారుణమన్నారు అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ ఏఐటీయూసీ నాయకులు సీతామహాలక్ష్మి. ఆదివారం కర్నూలు, నంద్యాల, డోన్​, ఆదోని, ఎమ్మిగనూరు తదితర ప్రాంతాల్లోని అంగన్​వాడీ, ఆశా, కార్మిక నాయకులను ధర్నాకు వెళ్లకుండా పోలీసులు హౌస్​ అరెస్టు చేశారు. ఈ సందర్భంగా సీతామహాలక్ష్మి మాట్లాడుతూ పాదయాత్రలో భాగంగా ఇచ్చిన హామీలను నెరవేర్చలేని సీఎం వైఎస్​ జగన్​మోహన్​ రెడ్డి… ఇప్పుడు ప్రశ్నించే గొంతుకను అణిచి వేస్తున్నారని ధ్వజమెత్తారు. డిమాండ్లు నెరవేర్చేంత వరకు పోరాడుతామన్నారు. ఈ నెల 14న ఏఐటీయూసీ అనుబంధ సంస్థ అంగన్​వాడీ వర్కర్స్​ అసోసియేషన్​ ఆధ్వర్యంలో ధర్నా చేపడతామని ఈ సందర్భంగా నాయకురాలు సీతామహాలక్ష్మి స్పష్టం చేశారు.

About Author