PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సినీ కార్మికుల కోసం ఆస్ప‌త్రి నిర్మిస్తా : చిరంజీవి

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : సినీ కార్మికుల కోసం త్వరలోనే ఓ ఆస్పత్రి కట్టిస్తానని మెగాస్టార్‌ చిరంజీవి అన్నారు. బంజారాహిల్స్‌లోని పార్క్‌ హయత్‌ హోటల్‌లో ఈ ఏడాది డల్లాస్‌లో నిర్వహించబోయే సెలబ్రిటీ క్రికెట్‌ లీగ్‌ మ్యాచ్‌ జెర్సీ, ట్రోఫీ ఆవిష్కరణ సభకు ఆయన ముఖ్య అతిథి­గా విచ్చేశారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ సినీరంగంలో ఓ సినిమా నిర్మించాలంటే ఎంతో మంది కార్మికులు ఎంతో కష్టపడతారని, వారి కోసం తాను తన తండ్రి కొణిదెల వెంకట్రావు పేరుతో ఆస్పత్రి నిర్మిస్తానని ప్రకటించారు.

                                            

About Author