ఇలాంటి మెసేజ్ ల పై క్లిక్ చేశారో.. ఇక అంతే సంగతులు !
1 min readపల్లెవెలుగువెబ్ : యువతకు ఎస్ఎంఎస్, వాట్సాప్ మెసేజ్‌ల ద్వారా మోసగాళ్లు వల వేస్తున్నారు. చాట్-బేస్డ్ డైరెక్ట్ హైరింగ్ ప్లాట్‌ఫారమ్ హైరెక్ట్ నివేదిక ప్రకారం.. భారతదేశంలో దాదాపు 56% మంది ఉద్యోగార్ధులు తమ ఉద్యోగ వేటలో జాబ్ స్కామ్ల ద్వారా ప్రభావితమయ్యారు. 20 నుంచి 29 సంవత్సరాల మధ్య వయసు గల ఉద్యోగార్థులు స్కామర్ల ప్రధాన లక్ష్యమని నివేదిక హైలైట్ చేసింది. నిరాశలో ఉన్న అభ్యర్థులకు అధిక జీతాల పేరిట ఆశ చూపించి, వారి నుంచి స్కామర్లు నగదు వసూలు చేస్తున్నారు. కొన్ని జాబ్ ఆఫర్‌లు ఇచ్చేవారు బాధితులతో ఆన్‌లైన్‌లో ఉచితంగా పని చేసుకుని ప్రయోజనం పొందుతున్నారు. కొన్ని జాబ్ ఏజెన్సీలు జాబ్‌లో చేరడానికి ముందు శిక్షణ పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నాయి. వాట్సాప్‌లో లేదా ఎస్ఎంఎస్ ద్వారా జాబ్ ఆఫర్స్ అంటూ మెసేజ్‌లు పంపుతూ ప్రజలను ఆకర్షిస్తున్నారు. ‘మీరు మా ఇంటర్వ్యూలో ఉత్తీర్ణులయ్యారు, శాలరీ రోజుకు రూ.8000. వివరాలను చర్చించడానికి దయచేసి సంప్రదించండి http://wa.me/9191XXXXXX SSBO.’ వంటి ప్రమాదకరమైన లింక్స్‌ను స్కామర్లు పంపుతున్నారు.