NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ల‌క్ష రూపాయ‌లు డిపాజిట్ చేస్తే.. నెల‌కు రూ. 8 వేలు ఇస్తార‌ట !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : లక్ష డిపాజిట్‌ చేస్తే ప్రతినెలా రూ. 8 వేలు చెల్లిస్తామంటూ మాయమాటలు చెప్పి కోట్లాది రూపాయలు దండుకుని మోసానికి పాల్పడిందంటూ ప్రజల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై స్పందించిన పోలీసులు.. ఆ సంస్థకు చెందిన 24 కార్యాలయాల్లో తనిఖీలు చేపట్టారు. వేలూరు లో ప్రధాన కార్యాలయం కలిగిన ‘ఇంటర్నేషనల్‌ ఫైనాన్స్‌ సర్వీస్‌’ సంస్థకు చెన్నై, కాంచీపురం, అరక్కోణం సహా 21 చోట్ల బ్రాంచీలున్నాయి. తమ వద్ద లక్ష రూపాయలు డిపాజిట్‌ చేస్తే ప్రతి నెలా రూ.8వేలు ఇస్తామంటూ ఈ సంస్థ గతంలో ఇచ్చిన ఆకర్షణీయ ప్రకటన నమ్మిన వందలాదిమంది డిపాజిట్లు చేశారు. డిపాజిటల్‌ దారులకు రెండు నెలల పాటు ఠంచనుగా వడ్డీ చెల్లించిన ఈ సంస్థ ఆ తరువాత ముఖం చాటేసింది. దాంతో డిపాజిట్‌ దారులంతా ఆ సంస్థ కార్యాలయాలపై ఒత్తిడి చేశారు. దీంతో ఆ సంస్థ నిర్వాహకులు డిపాజిట్‌ దారులపై బెదిరింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

                                       

About Author