PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

హెల్మెట్ లేక‌పోతే లైసెన్స్ ర‌ద్దు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ట్రాఫిక్‌ ఉల్లంఘనలను అరికట్టేందుకు ముంబై ట్రాఫిక్‌ పోలీసులు సరికొత్త చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఈ మేరకు ముంబైలో హెల్మెట్‌ లేకుండా రైడింగ్‌ చేస్తే మూడు నెలలపాటు లైసెన్స్‌ రద్దు చేస్తాం అని పోలీసులు చెప్పారు. అంతేకాదు యూట్యూబ్‌లో ఈ కొత్త నిబంధనలకు సంబంధించిన వీడియోని ముంబై పోలీసులు పోస్ట్‌ చేశారు కూడా. ఆ వీడియోలో ….”హెల్మెట్ లేకుండా ప్రయాణించడం ప్రమాదకరం. హెల్మెట్ లేకుండా ప్రయాణించే ప్రతి వ్యక్తి చలాన్‌ని వెంటనే ఆర్టీవోకి పంపుతాం. దీంతో మూడు నెలల పాటు లైసెన్స్‌ రద్దు చేయడమే కాకుండా జరిమాన కూడా విధించబడుతుంది. ఆ తర్వాత ఆ వ్యక్తి సమీపంలోని ట్రాఫిక్‌ పోలీస్టేషన్‌ పంపిస్తాం. ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించే వీడియోలను చూపిస్తాం.” అని డీసీపీ రాజ్‌ తిలక్‌ రోషన్‌ పేర్కొన్నారు.

                                             

About Author