చెప్పినట్టు వినకపోతే జగన్ జైలుకే !
1 min read
పల్లెవెలుగువెబ్ : కేంద్రం చేతిలో జగన్ కీలుబొమ్మగా మారారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. ప్రధాని మోదీ, అమిత్ షా చెప్పినట్లు సీఎం జగన్ మోహన్ రెడ్డి వినకపోతే జగన్ రెడ్డికి జైలు జీవితం తప్పదన్నారు. చంద్రబాబుకు దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ అయితే మోదీకి దత్త పుత్రుడు జగన్మోహన్ రెడ్డి అని వ్యాఖ్యానించారు. 151 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకొని ఆర్భాటంగా తిరిగిన జగన్ ప్రస్తుతం మీసాలు దించుకొని తిరిగే పరిస్థితి దాపురించిందన్నారు.