అలా చేస్తే సగం ధరకే పెట్రోల్ ..!
1 min readపల్లెవెలుగువెబ్ : అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరల్లో మార్పులు ప్రపంచదేశాలను కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ఇక రష్యా-ఉక్రెయిన్ వార్‌తో క్రూడాయిల్ ధరలు కొత్త గరిష్టాలను తాకాయి. భారత ప్రభుత్వం క్రూడాయిల్ ధరల నుంచి ఉపశమనం పొందేందుకుగాను ఫ్లెక్స్ ఫ్యుయల్ వాహనాల తయారీపై ముమ్మర ప్రయత్నాలను చేస్తోంది. 100 శాతం స్వచ్ఛమైన ఇంధన వనరుల నుండి ప్రజా రవాణాను నడిపేందుకు ప్రభుత్వం ప్రణాళికపై పని చేస్తుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. వాహన దారులకు సాధారణ పెట్రోల్‌తో పోలిస్తే సగం ధరకే ఇంధనం లభిస్తోందని గడ్కరీ అభిప్రాయపడ్డారు. ఫ్లెక్స్-ఫ్యుయల్ అనేది గ్యాసోలిన్ ,మిథనాల్ లేదా ఇథనాల్ మిశ్రమం నుంచి తయారైన ప్రత్యామ్నాయ ఇంధనం. పెట్రోల్‌లో ఇథనాల్‌ను 20 శాతం కలపడంతో ఫ్లెక్స్ ఫ్యుయల్ తయారవుతుంది. పెట్రోల్ కంటే దీని ధర తక్కువగా ఉంటుంది.