అలా చేస్తే దేశం మూడు ముక్కలు !
1 min readపల్లెవెలుగువెబ్ : హిందీ నిర్బంధ అమలును వ్యతిరేకిస్తూ తమిళనాడు అసెంబ్లీ తీర్మానం చేసింది. మంగళవారంసభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి స్టాలిన్ మాట్లాడుతూ కేంద్రంపై నిప్పులు చెరిగారు. ఆంగ్లభాషను తొలగించి హిందీకి పట్టం కట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని, హిందీని నిర్బంధంగా అమలు చేస్తే దేశం మూడు ముక్కలవ్వడం ఖాయమని హెచ్చరించారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అధ్యక్షతన పార్లమెంటరీ అధికార భాషా కమిటీ గత వారం రాష్ట్రపతికి ఓ నివేదికను సమర్పించిందని, అందులో ఐఐటీ, ఐఐఎం, ఎయిమ్స్, కేంద్రప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాల్లో హిందీ శిక్షణా భాషగా ఉండాలని, ఆంగ్లానికి బదులుగా హిందీ మాధ్యమంలోనే పాఠాలు బోధించాలని సిఫారసు చేసినట్లు వెల్లడైందన్నారు. ఆ ప్రతిపాదనలన్నీ రాజ్యాంగ ధర్మాసనానికి విరుద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు.