ఇలా చేస్తే మీ చుండ్రు మాయం !
1 min readపల్లెవెలుగువెబ్ : వర్షా కాలంలో జుట్టు ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే పలు కీలక సూచనలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా జుట్టు ఆరోగ్యం దెబ్బతింటుందని చెబుతున్నారు. ఇందుకోసం కొన్ని టిప్స్ అందిస్తున్నారు. బౌల్‌లో రెండు టీస్పూన్ల వేపపిండిని తీసుకోవాలి. ఇందులోకి రెండు టీస్పూన్ల శనగపిండిని తీసుకోవాలి. ఇందులోకి తగినంత పెరుగు వేసి పేస్ట్ చేసుకోవాలి. జుట్టుకు పట్టించి అరగంట తర్వాత కడిగేయాలి. ఇలా రెండు వారాలకోసారి చేస్తుంటే చుండ్రు తగ్గిపోవటంతో పాటు జుట్టు సిల్కీగా తయారవుతుంది. పెరుగు, నిమ్మరసం, ఆవనూనె బాగా కలిపి పేస్ట్ చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి ఆరిన తర్వాత జుట్టును శుభ్రపరచుకోవాలి. ఇలా చేస్తే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. రెండు కోడిగుడ్లు వైట్, కొద్దిగా నిమ్మరసం, కాస్త తేనె కలిపి చక్కగా మిక్స్ చేయాలి. ఆ పేస్ట్‌ను జుట్టుకు పట్టిస్తే చక్కని ఫలితం ఉంటుంది.