NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

‘నా డ‌బ్బు ఇవ్వక‌పోతే.. భూమండ‌లాన్ని మాడిపోయేలా చేస్తా’

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : త‌న గ్రాట్యుటీ డ‌బ్బు ఇవ్వక‌పోతే.. ఈ ప్రపంచాన్ని క‌రువు కాట‌కాల‌తో మ‌లమ‌ల‌మాడేలా శపిస్తాన‌ని ఓ మాజీ ఉద్యోగి శ‌పించాడు. గుజ‌రాత్ కు చెందిన మాజీ ప్రభుత్వ ఉద్యోగి ర‌మేష్ చంద్ర ఫెఫ‌ర్.. తాను విష్ణుమూర్తి చివ‌రి అవ‌తార‌మైన క‌ల్కి అవ‌తార‌మని చెప్పుకుంటాడు. త‌ను అవతార పురుషుడ‌ని చాలా కాలంగా ర‌మేష్ చెప్పుకుంటున్నాడు. ర‌మేష్ చంద్ర ఇటీవల వాలంట‌రీ రిటైర్మెంట్ తీసుకున్నాడు. తాజాగా ర‌మేష్ చంద్ర జ‌ల‌వ‌న‌రుల శాఖ కార్యద‌ర్శికి లేఖ రాశాడు. త‌న గ్రాట్యూటీ డ‌బ్బు ఇవ్వకుండా రాక్షసంగా త‌న‌ను వేధిస్తున్నార‌ని ఆ లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వం త‌న 16ల‌క్షల గ్రాట్యుటీ డ‌బ్బు, ఏడాది జీతం నిలిపివేసి ఇబ్బందికి గురి చేస్తోంద‌న్నారు. దీనికి ప్రతీకారంగా ఈ భూమండ‌లాన్ని మ‌ల‌మ‌ల‌మాడిపోయేలా శ‌పిస్తానని ఆగ్రహం వ్యక్తంచేశారు.

About Author