ఈ మాల్ వేర్ను డౌన్ లోడ్ చేస్తే..మీ డబ్బులు పోవడం ఖాయం !
1 min readపల్లెవెలుగు వెబ్: సైబర్ నేరగాళ్ల ఆగడాలు పెచ్చు మీరుతున్నాయి. మాలిషియస్ మాల్ వేర్ తో ప్రజల బ్యాంకు ఖాతాలు కొల్లగొడుతున్నారు. ఇలాంటి మాలిషియస్ మాల్ వేర్ తో జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ హెచ్చరించారు. జోకర్ పేరుతో మాలిషియస్ మాల్ వేర్ ప్రవేశపెట్టి మోసాలకు పాల్పడే అవకాశం ఉందని సీపీ అంజనీ కుమార్ తెలిపారు. గూగుల్ సంస్థ ఈ మాల్ వేర్ ను బ్లాక్ చేసిందని, ప్లే స్టోర్ నుంచి పలు దఫాలు తొలగించినా.. వేరు వేరు పేర్లతో జోకర్ మాలిషియస్ మాల్ వేర్ ను సైబర్ నేరగాళ్లు ప్రవేశపెడుతున్నారని ఆయన తెలిపారు. వీటిని డౌన్ లోడ్ చేస్తే ప్రజల అకౌంట్లలో నుంచి డబ్బులు మాయం చేసే అవకాశం ఉందని హెచ్చరించారు. గత మూడు నెలలుగా ముంబయిలో ఇలాంటి ఘటనలు వరుసగా జరిగాయని తెలిపారు. అనుమానాస్పద మెసేజ్ లు, లింకులు చూడొద్దని ఆయన తెలిపారు.