NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

గోమూత్రం తాగితే.. క‌రోన రాదు: బీజేపీ ఎంపీ

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: బీజేపీ ఎంపీ సాద్వి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ వివాద‌స్పద వ్యాఖ్యలు చేశారు. తాను రోజూ గోమూత్రం తాగ‌డం వ‌ల్లే క‌రోన రాలేద‌ని చెప్పింది. దేశీ గోమూత్రం ప్రతిరోజు తీసుకుంటే.. అది ఊపిరితిత్తుల‌ను కోవిడ్ ఇన్ఫెక్షన్ నుంచి కాపాడుతుంద‌ని, తాను రోజూ గోమూత్రం తాగుతాన‌ని చెప్పారు. ప్రతి రోజూ గోమూత్రం తీసుకోవ‌డం వ‌ల్ల తాను క‌రోన‌కు ఎలాంటి ఔష‌ధాన్ని తీసుకోలేద‌ని చెప్పింది. గోమూత్రం వ‌ల్లే త‌న‌కు క‌రోన రాలేద‌ని చెప్పింది. మ‌ధ్యప్రదేశ్ లోని భోపాల్ లో జ‌రిగిన బీజేపీ కార్యక‌ర్తల స‌మావేశంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేసింది. గతంలో కూడ ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలే ఆమె చేశారు. గోమూత్రం తీసుకోవ‌డం వ‌ల్ల త‌న‌కు క్యాన్సర్ జ‌యించాన‌ని రెండేళ్ల క్రితం ఆమె వ్యాఖ్యానించారు.

About Author