NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

తిని కూర్చుంటే.. క‌రోన కాటేస్తుంది..!

1 min read

పల్లెవెలుగు వెబ్: శారీర‌క శ్రమ‌చేయని వారిలో క‌రోన వైర‌స్ సోకే ప్రమాదం ఎక్కువ‌గా ఉంద‌ని ఓ ప‌రిశోధ‌న‌లో తేలింది. అమెరికాలోని కాలిఫోర్నియా శాన్ డియాగో యూనివ‌ర్శిటీ శాస్త్రవేత్తలు ఈ మేర‌కు ఓ హెచ్చరిక చేశారు. తిని కూర్చుంటే జ‌రిగే ప్రమాదం గురించి ముందుగా హెచ్చరించారు. శారీర‌క శ్రమ మాన‌వ జీవ‌న శైలిలో భాగం కావాల‌ని వారు చెబుతున్నారు. ప్రతివారం క‌నీసం 150 నిమిషాలు శారీర‌క శ్రమ చేసే వారితో పోలిస్తే… వారం మొత్తం విశ్రాంతి తీసుకునే వారిలో వైర‌స్ అధికంగా సోకి ఆస్పత్రికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింద‌ని ప‌రిశోధ‌న‌లో తేలింది. శారీర‌క శ్రమ త‌ప్పనిస‌రిగా జీవ‌న‌శైలిలో భాగంగా చేసుకుంటే క‌రోన బారి నుంచి త‌ప్పించుకోవ‌చ్చని శాస్త్తవేత్తలు చెబుతున్నారు.

About Author