PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అక్క‌డ తిని ప‌డుకుంటే డ‌బ్బులొస్తాయ‌ట !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఏం చేయకుండా ఎంత ఎక్కువ సేపు పడుకుంటే అన్ని ఎక్కువ డబ్బులొచ్చే పోటీ ఒకటి ఉంది. అదే ‘లైయింగ్‌డౌన్‌ కాంపిటీషన్‌’. పన్నెండో ఏడాది దిగ్విజయంగా జరిగిన ఈ పోటీలో 60 గంటలపాటు పడుకొని, బహు­మ­తి గెలుచుకున్నాడు జర్కో పెజనోవిక్‌. నగదు­తోపాటు ఇద్దరికి రెస్టారెంట్‌లో భోజనం, ఓ ప్రత్యేక గ్రామంలో వీకెండ్‌స్టే, రివర్‌ రాఫ్టింగ్‌ చేసే అవకాశాన్ని కూడా దక్కించుకున్నాడు. యూరప్‌ దేశమైన మాంటెనెగ్రోలోని నగరం నిక్సిక్‌లో ఈ వింత పోటీ జరిగింది. ‘ఏ పని చేయకుండా పడుకొని డబ్బులు సంపాదించడమేగా. ఈజీగా చేసేయొచ్చు అనుకు­న్నాను.. కానీ కష్టమే’ అన్నాడు జర్కో. చూడ­టా­నికి కుటుంబసభ్యు­లెవరైనా వచ్చినప్పుడు కూడా లేవకుండా ఉండగలగడం కష్టమైన విషయమని చెప్పాడు.

                             

About Author